తెలంగాణలో ఈ ఫార్మాల కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయాలన్నా లేదా చార్జిషీట్ దాఖలు చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి అని ఆయన తెలిపారు. 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు. గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చినా, చార్జిషీట్‌కు ఇంకా ఆమోదం రాలేదని, అందువల్ల బెయిల్ అవకాశాలు ఉన్నాయని అన్నారు.