సినీ నటుడు, ఎంపీ కమల్‌హాసన్ ట్విట్టర్ ద్వారా తమిళనాడు గవర్నర్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. లోక్‌భవన్‌లో కాకుండా అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించాలని కమల్‌హాసన్ డిమాండ్ చేశారు. ఎన్నికైన ప్రతినిధులు ప్రమాణస్వీకారం చేయకపోవడం రాష్ట్రానికి అవమానకరమని, ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేయడం ప్రజలను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని ఆయన అన్నారు.