గణపతి బప్పా మోరియా నామస్మరణతో దేశం మార్మోగుతోంది. ముంబయిలో ప్రసిద్ధ లాల్ బాగ్చా రాజా గణనాథుడి ఊరేగింపు ప్రారంభమైంది. ఈ శోభాయాత్రలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల నృత్యాలు, జయజయధ్వానాల మధ్య గణనాథుడు ముందుకు కదులుతున్నాడు.