గ్రాండ్ విక్టరీ.. టాప్‌-10లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

ఇండోనేషియా ఓపెన్ తొలి రౌండ్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం సాధించారు. థాయిలాండ్‌కు చెందిన బుసానన్‌ను 25-23, 21-16తో ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఈ విజయంతో 2023 తర్వాత తొలిసారిగా టాప్-10 ర్యాంకు సాధించారు. మెన్స్ డబుల్స్‌లో హరిహరణ్-అర్జున్ జంట కూడా విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. అయితే, మాజీ వరల్డ్ నంబర్ 1 శ్రీకాంత్, లక్ష్యసేన్ మాత్రం తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్