రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పోలాండ్‌లో ఆడమ్ గ్లాజెవ్స్కీ తన ఆస్తులను కాపాడుకోవడానికి 1939లో ఇంటి సెల్లార్‌లో వెండి వస్తువులు, ఆభరణాలను పాతిపెట్టారు. యుద్ధానంతరం ఆయన కుమారులు పోలాండ్‌కు తిరిగి రాలేకపోయారు. తర్వాతి తరానికి చేరిన ఈ కథలో, జాన్ గ్లాజెవ్స్కీకి నిధి ఉన్న ప్రదేశం గురించి చెప్పి, గుర్తుల ఆధారంగా ఒక మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఇటీవల ఆ మ్యాప్ లభించడంతో, జాన్ పోలాండ్‌లోని తన పూర్వీకుల భవనానికి చేరుకుని, 91 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌తో పాటు స్థానికుల సహాయంతో తవ్వకాలు చేపట్టారు. 19వ శతాబ్దానికి చెందిన బంగారం, వెండి పాత్రలు బయటపడ్డాయి. ఈ సంపద ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో మిలియన్ల డాలర్ల విలువ చేస్తుంది. 80 సంవత్సరాల తర్వాత తన తాత పాతిపెట్టిన నిధిని కనుగొనడంతో జాన్ ఆనందానికి అవధులు లేవు.