అదుపుతప్పిన గ్రానైట్ లారీ.. తప్పిన ప్రాణాపాయం

TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ సెంటర్‌లో శనివారం సాయంత్రం భారీ ప్రమాదం తప్పింది. గ్రానైట్ లోడుతో వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి ముందున్న ఆటోను, ఆపై ఎదురుగా వస్తున్న మరో ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. దీంతో అక్కడున్న వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్