అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ, ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు అని, ఇకపై అన్ని సానుకూల చర్యలే ఉంటాయని పేర్కొన్నారు. ఇరాన్‌కు యుద్ధంతో విసుగొచ్చిందని, ఇప్పుడు శాంతి కోరుకుంటోందని, మిగతా దేశాలకూ ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చని, పరిస్థితి సజావుగా సాగేందుకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తామన్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ కాల్పుల విరమణను స్వాగతించారు. ఇజ్రాయెల్ కూడా అమెరికా నిర్ణయానికి మద్దతు తెలిపింది.