అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా సోమరితనంతో ఎంతోమంది భిక్షం ఎత్తుకుంటూ రోడ్లపై కనిపిస్తుంటారు. కానీ ఓ వృద్ధురాలు, పండుముసలితనంలో కూడా తన ధైర్యాన్ని విడువలేదు. చేసే చిన్న పని అయినా కష్టాన్నే ఇష్టంగా మలుచుకొని జీవిస్తోంది. రాజస్థాన్‌లోని ఓ వృద్ధురాలు భిక్షాటన చేసేందుకు మనసొప్పక పండుముసలితనంలో సైతం వణుకుతూ పెన్నులను అమ్ముతూ జీవిస్తోన్న వీడియో వైరల్ అవుతోంది. మనం ఎవరికీ సాయం చేసినా చేయకపోయినా.. ఇలాంటి ఆత్మాభిమానం ఉన్న వాళ్లకు సహాయం చేసి అండగా నిలుద్దాం.