తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడు రోజుల క్రితం 5వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా, తాజాగా 2,437 పోస్టులను పెంచారు. ఇందులో ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో 790, జైల్ విభాగంలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 1,424 పోస్టులున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.