తన అంకుర సంస్థ ‘ఎక్స్ఏఐ’ అభివృద్ధి చేసిన గ్రోక్ ఏఐని త్వరలో టెస్లా వాహనాలకూ అనుసంధానం చేయనున్నట్లు బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించారు. వచ్చే వారం నుంచే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా కార్లలో గ్రోక్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. టెస్లా వాహనాల్లో గ్రోక్ హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. మ్యాప్స్, ట్రాఫిక్ పరిస్థితుల గురించి డ్రైవర్లు అడిగే ప్రశ్నలకు గ్రోక్ రియల్-టైమ్‌లో సమాధానాలు ఇస్తుంది.