కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. యువతికి తాళి కట్టిన 15 నిమిషాల్లోనే గుండెపోటుతో వరుడు చనిపోయాడు. నందికేశ్వర్ కల్యాణ మంటపంలో వరుడు ప్రవీణ్ కుర్నే (26) ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, పెళ్లి జరిగిన కొద్దీ క్షణాల్లోనే వరుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.