పెళ్లైన మరుసటి రోజే ఉరివేసుకున్న వరుడు!

యూపీలోని బరేలీ జిల్లా షాహిలో పెళ్లైన మరుసటి రోజే వరుడు దేవేంద్ర మౌర్య మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. రాత్రి స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే దేవేంద్ర మృతదేహం ఆరు అడుగుల ఎత్తులో మామిడి కొమ్మకు తాడుతో వేలాడుతూ, పాదాలు నేలను తాకుతూ వంగి ఉండటంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది హత్య అని, ఆత్మహత్య కాదని తండ్రి రామ్‌దాస్ మౌర్య అనుమానం వ్యక్తం చేశారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదిక ఉరి వేసుకోవడం వల్లే మరణం సంభవించినట్లు నిర్ధారించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్