TG: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలవారిగూడెంకు చెందిన మాసన పుట్టుకతో అంధురాలు. పదో తరగతి వరకు గ్రామంలో చదవుకుంది. ఆ తర్వాత స్నేహితుల సాయంతో కారేపల్లికి 4 కిలోమీటర్లు నడిచి ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే మానస ఇంటి వద్దే ప్రిపేర్ అయ్యి 2022లో ఓ బ్యాంక్‌లో ఉద్యోగం సాధించింది. బ్యాంక్ ఉద్యోగంతో పాటు సహాయకురాలి సాయంతో గ్రూప్-4 పరీక్ష రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో మానస జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగం సాధించారు.