ఇంట్లో తాజా కొత్తిమీర పెంచుకోవడం చాలా సులభం. సరైన విధానాలు పాటిస్తే కేవలం 7 రోజుల్లోనే పచ్చగా మొలకలు వస్తాయి. ముందుగా నాణ్యమైన ధనియాలను తీసుకుని స్వల్పంగా నలిపి రెండు ముక్కలుగా చేసి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వెడల్పు ఉన్న కుండీలో మట్టి, ఇసుక, వర్మీకంపోస్ట్ మిశ్రమాన్ని నింపి విత్తనాలను చల్లి పలుచని మట్టిపొర కప్పాలి. ఈ వేసవిలో కుండీని పూర్తిగా ఎండలో కాకుండా పాక్షిక నీడలో ఉంచాలి. మట్టిలో తేమ ఉండేలా నీరు చల్లాలి కానీ నీరు నిల్వ కాకుండా చూడాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే వారం రోజుల్లోనే కొత్తిమీర మొలకలు వచ్చి ఆరోగ్యంగా పెరుగుతాయి.