దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఎయిర్ ప్యూరిఫైయర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. గతంలో ఢిల్లీ-NCRకే పరిమితమైన ఈ మార్కెట్ ఇప్పుడు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకూ విస్తరిస్తోంది. అమెజాన్ ఇండియాలో గత వారంలో అమ్మకాలు రెట్టింపు కాగా, షావోమీ విక్రయాలు ఏడాదిలో నాలుగు రెట్లు పెరిగాయి. ఢిల్లీలో ఇటీవల AQI 367గా నమోదైంది. ది నాలెడ్జ్ కంపెనీ అంచనాల ప్రకారం, ప్రస్తుతం రూ.320 కోట్లుగా ఉన్న ఈ మార్కెట్ 2029-30 నాటికి రూ.1,000 కోట్లకు చేరే అవకాశం ఉంది.