ఈ నెల 30న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. అక్టోబర్‌ 30న రాత్రి 11.51 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని ద్వారా ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది. ఈ విషయాన్ని ఇస్రో సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. ఈ ఉపగ్రహం భారత్‌ స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ ‘నావిక్‌’ను మరింత బలోపేతం చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕