భారత అంతరిక్ష రంగంలో ఇస్రో మరో కీలక ప్రయోగం చేయనుంది. నావిగేషన్ సేవలందించే ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. స్వదేశీ సాంకేతికను బలోపేతం దిశగా శుక్రవారం రాత్రి 11.51 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 18 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి లాంచ్ చేయనున్నారు.