GSLV-F18 రాకెట్ ప్రయోగం విజయవంతం

తిరుపతి శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇస్రో చేపట్టిన GSLV-F18 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ 50 మీటర్ల జంబో రాకెట్ ద్వారా NVS-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 2,232 కిలోల బరువున్న ఈ ఉపగ్రహంలో స్వదేశీ, విదేశీ న్యూక్లియర్ వాచ్‌లను అమర్చారు. సుమారు 13 ఏళ్ల పాటు సేవలందించనున్న ఈ శాటిలైట్, భారత సరిహద్దుల వెంబడి 1500 కిలోమీటర్ల మేర ఖచ్చితమైన లొకేషన్ సమాచారాన్ని అందించనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕