14 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 13.9 శాతం పెరిగి రూ.1.95 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన స్థూల వసూళ్లు 6.5 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లుగా నమోదవగా, దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 34.6 శాతం పెరిగి రూ.60,038 కోట్లకు చేరింది. జూన్‌లో నికర వసూళ్లు 11.2 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్