పనికి రాని, కాలుష్యకారకమైన 97 లక్షల వాహనాలను స్క్రాప్ చేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.40 వేల కోట్ల మేర జీఎస్టీ ఆదాయం వస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం అన్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు మూడు లక్షల వాహనాలను తుక్కుగా మార్చినట్లు వెల్లడించారు. అందులో 1.41 లక్షల ప్రభుత్వ వాహనాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు ఏసీఎంఏ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు.