IPL 2026 ఫైనల్: ఐదో వికెట్ కోల్పోయిన GT

కీలకమైన IPL 2026 ఫైనల్‌‌లో RCB బౌలర్లు చెలరేగుతున్నారు. తాజాగా జోష్ హేజిల్ వుడ్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి GT బ్యాటర్ అర్షద్ ఖాన్ ఔట్ అయ్యారు. అర్షద్ ఖాన్ పుల్ షాట్ ఆడే క్రమంలో టాప్-ఎడ్జ్‌కు బంతి తగలడంతో షార్ట్ ఫైన్‌లో ఉన్న రసిఖ్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో అర్షద్ పెవిలియన్ చేరారు. దీంతో 14.1 ఓవర్లలో 99 పరుగులకే 5 వికెట్లను GT కోల్పోయింది.

సంబంధిత పోస్ట్