తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. నల్గొండ జిల్లా స్థానిక మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో గ్రామాభివృద్ధే ధ్యేయంగా భావించి గ్రామస్థులందరూ ఏకగ్రీవంగా సర్పంచిని ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆదివారం గ్రామంలో ఎవరు పోటీ చేయాలనే దానిపై వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలతో గ్రామ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. కానీ అధికారణంగా ప్రకటించాల్సి ఉంది.