గన్‌ కలకలం.. భార్యను తుపాకీతో బెదిరించిన భర్త

అనంతపురం జిల్లా విద్యుత్‌నగర్‌కు చెందిన రాజశేఖర్, మనుషా దంపతుల మధ్య గొడవల నేపథ్యంలో.. భర్త రాజశేఖర్ తన భార్య మనుషాను తుపాకీతో బెదిరించిన ఘటన కలకలం సృష్టించింది. మనుషా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు రాజశేఖర్ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపిన పోలీసులు, రాజశేఖర్‌కు తుపాకీ ఎలా వచ్చిందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్