ఏపీలోని పులివెందులలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఎంపీ అవినాష్ సహా నేతలు నిరసనకు దిగారు. మరోవైపు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసమయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు.