బలూచిస్తాన్‌లో 9 మంది బస్సు ప్రయాణికుల్ని చంపిన దుండగులు

పాకిస్థాన్ బలూచిస్తాన్‌లో దారుణం జరిగింది. సాయుధ దుండగులు ప్రయాణికుల బస్సు ఆపి, తొమ్మిది మంది పురుషులను కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరగగా, మృతదేహాలు రాత్రి పర్వతాల్లో కనుగొనబడ్డాయి. బస్సులోని పంజాబ్‌ వాసులను వదిలిపెట్టి, మిగతావారిని లక్ష్యంగా చేసుకున్నారు. ఘటనకు బాధ్యులు ఎవరో ఇంకా తెలియలేదు. దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ఈ ఘటనను ఖండించారు.

సంబంధిత పోస్ట్