మెడికల్ స్టోర్‌లో దుండగుల కాల్పులు (వీడియో)

చండీగఢ్‌లోని సెక్టార్ 11లో ఉన్న షాప్‌ నెంబర్ 14లో కాల్పుల కలకలం రేగింది. మెడికల్ స్టోర్‌లో చొరబడిన దుండగులు తుపాకీతో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. క్యాషియర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. మెడికల్ స్టోర్‌కు ఇద్దరు దుండగులు ముసుగులు ధరించుకొని రావడం వీడియోలో చూడవచ్చు. జేబులో నుంచి తుపాకీ తీసి కాల్పులు జరిపారు.

సంబంధిత పోస్ట్