తిరుమలలో ఘనంగా గురు పౌర్ణమి గరుడసేవ

గురుపౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో గురువారం టీటీడీ గరుడవాహన సేవ నిర్వహించింది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల సమయంలో శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై తిరుమాఢవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గరుడవాహనంపై వచ్చిన స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. కాగా, ఈ సేవలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పాల్గొన్నారు. భక్తులు శ్రీవారికి అడుగడుగునా హారతులు పట్టి.. గోవింద నామస్మరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్