గురువులు స్వార్థం లేకుండా శిష్యుల శ్రేయస్సు కోసం బంగారు బాటలు వేస్తారు. కానీ నేటి సోషల్ మీడియా, సినిమాలలో గురువులను కించపరిచే విధంగా చూపించడం సబబు కాదు. శాస్త్రాల ప్రకారం గురువు లేని జన్మ గుడ్డి జన్మతో సమానం. అలాగే గురువులు కూడా సమాజం పట్ల బాధ్యతాయుతంగా, శిష్యుల శ్రేయస్సు కోసం పనిచేయాలి. శిష్యులు గురువు బోధనలను పాటించి, గురువుకు మంచి పేరు తెచ్చేలా నడుచుకోవడమే నిజమైన గురుపూజ.