హిందువులు జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. ఆషాడ మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. గురు సామానులైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుటయే ఈ గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తుల స్వరూపమే గురువు అని భావిస్తారు. వ్యాస భగవానుడిని మొదటి గురువుగా పూజిస్తారు కాబట్టి దీనిని వ్యాస పౌర్ణమి అంటారు. గురుపరంపరలో ఆదిశంకరాచార్యులు మొదటివారు.