హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమి ప్రత్యేకమైనది. గురువు అజ్ఞాన చీకటిని తొలగించి, జ్ఞాన వెలుగును ప్రసాదిస్తాడు. తల్లిదండ్రుల తర్వాత గురువే జీవిత ఎదుగుదలలో కీలకం. గురువు అనుగ్రహం పొందినవారు తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారు. కాబట్టి గురువులను గౌరవించి, వారి మాటలు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చు.