ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)గా జ్ఞానేశ్ కుమార్ ఇకపై ఆ పదవిలో కొనసాగలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘మా వద్ద తగిన ఆధారాలున్నాయి. వాటిని వెల్లడించిన తర్వాత కూడా ఆయన్ను కాపాడాలని BJP యత్నిస్తే అప్పుడు ఆ పార్టీ ఆట బయటపడుతుంది. ఇది కేవలం మీటింగ్ కాదు.. రాజకీయ ఆయుధం. ప్రజల ఓటును నాశనం చేయాలని చూసిన మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ సహా అందరినీ టార్గెట్ చేస్తుంది. ఎల్లప్పుడూ మీరు దాక్కోలేరు’ అని ‘మాక్ పార్లమెంట్’లో వ్యాఖ్యానించారు.