జిమ్ కోచ్‌ను కత్తులతో పొడిచి చంపిన స్నేహితులు!

TG: హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బార్కాస్ ప్రాంతానికి చెందిన జిమ్ కోచ్ ఫహద్(29)ను, అతని స్నేహితుడు సయ్యద్, మరికొంత మంది మాట్లాడదామని పిలిచి కత్తులతో దాడి చేశారు. గత నాలుగు రోజులుగా ఓ విషయంలో వచ్చిన విభేదాల నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున మరియం కాలనీ వద్ద దాడి చేశారు. తీవ్ర గాయాలైన ఫహద్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్