అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (USCIS) హెచ్-1బీ వీసాలకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 85వేల వీసా స్లాట్లకు తగినన్ని పిటిషన్లు అందాయని, లాటరీలో ఎంపికైన వారికి పూర్తి స్థాయి పిటిషన్లు సమర్పించే గడువు ముగిసిందని తెలిపింది. దీంతో ఈ ఏడాది రెండోసారి లాటరీ నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది. అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి ఏటా 85 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తాయి. ఈసారి 2.11 లక్షల రిజిస్ట్రేషన్లు రాగా, గత ఏడాది కంటే 38.5% తగ్గాయి.