వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, చెమట వల్ల జుట్టు రాలడం, తల పై భాగంలో సమస్యలు సర్వసాధారణం. తలలో విపరీతమైన చెమట వల్ల జుట్టు జిడ్డుగా మారి, దుమ్ము, ధూళిని ఆకర్షించి నిర్జీవంగా మారుతుంది. దీనివల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రెండు, మూడు రోజులకు ఓసారి తలస్నానం చేయాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు టోపీ, స్కార్ఫ్ ధరించాలి. తల చర్మంపై దురద ఉంటే వైద్యులను సంప్రదించాలి. తగినంత నీరు త్రాగడం, పోషకాహారం తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి.