కలలో జుట్టు రాలడం ఒత్తిడి, ఆందోళనలకు సంకేతమా?

కలలో జుట్టు రాలిపోతున్నట్లు కనిపించడం ఒత్తిడి, ఆందోళన లేదా శక్తి తగ్గుదలను సూచిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇది ఆత్మవిశ్వాసం తగ్గడాన్ని లేదా జీవిత సమస్యలపై భయాన్ని కూడా సూచించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రుడు, శని, కేతు గ్రహాల ప్రభావం వల్ల ఇలాంటి కలలు వస్తాయని, ఇది మనస్సు, భావోద్వేగాలు, కుటుంబ వంశాన్ని సూచిస్తుందని అంటారు. ఇలాంటి కలలు తరచుగా వస్తే పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చేయడం, దానం చేయడం, శివాలయంలో అభిషేకం చేయడం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం ద్వారా మనసుకు శాంతి కలుగుతుందని విశ్వాసం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్