కేరళలో ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారికి ‘vote sweetend Kerala campaign’ పేరుతో హల్వా పంపిణీ చేయనుంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో కొత్త ఓటర్లు ఓటు వేసిన తర్వాత హల్వా తింటారు. దీనివల్ల ఓటర్లలో సామాజిక చైతన్యం పెరిగి, ఓటు హక్కు వినియోగించుకోవాలనే కోరిక కలుగుతుందని అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం లాంటిదని, ఈ హక్కును అందరూ వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు.