నా కొడుకుని ఉరితీయండి.. అత్యాచార కేసు నిందితుడి తల్లి

మహారాష్ట్రలో వివాహితపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్‌ శైలేష్‌ పాటిల్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు. భీవండిలో సెప్టెంబర్‌ 13న జరిగిన ఘటనలో తుపాకీతో బెదిరించి, మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్‌ కూడా నిందితుడిగా ఉన్నారు. కాగా తన కుమారుడు గతంలోనూ పలువురు మహిళలను వేధించాడని అతడి తల్లి సులోచన ఆరోపించారు. తనను తుపాకీతో బెదిరించి ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడని చెబుతూ, అతడికి ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕