యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. క్షుద్రపూజల పేరుతో వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ఓ మహిళ కొరడాతో చితక్కొట్టింది. క్షుద్రపూజల పేరుతో మౌల్వీ అనే వ్యక్తి సదరు మహిళను వేధించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.