పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన హర్భజన్

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ను హర్భజన్ సింగ్ బాయ్‌కాట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య వైరం తీవ్రమైన విషయం తెలిసిందే. పాక్‌తో ఎలాంటి సంబంధాలు, చర్చలుండవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మ్యాచ్ ఆడటానికి హర్భజన్ విముఖత చూపారు. ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్ కూడా మ్యాచ్ నుంచి వైదొలిగినట్లు సమాచారం. అటు పాక్‌తో మ్యాచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్