నిన్న రాజస్థాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో ఓడిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలర్ల ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్లు అద్భుతంగా రాణించి 150 పరుగులు సాధించారు. లక్ష్య ఛేదనలో ముంబై 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఈ ఓటమికి బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణమని, వారు ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యారని పాండ్యా పేర్కొన్నాడు.