బౌలర్లపై హార్దిక్ పాండ్య తీవ్ర అసంతృప్తి: 'మా ఓటమికి వారే కారణం'

ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఛేదనలో ముంబై 123 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ విభాగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఓటమికి బ్యాటర్ల తప్పేం లేదని, మొత్తం బౌలర్లదే అని పేర్కొన్నాడు. పవర్‌ప్లేలో మంచి బంతులు వేయలేకపోయామని, అదే మ్యాచ్‌లో పెద్ద తప్పిదం అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్‌లను ప్రశంసించాడు. తదుపరి మ్యాచ్‌లో గెలిచి తిరిగి ట్రాక్‌లోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్