పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఏపీలోని విశాఖపట్నంలో జులై 20న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్ కోసం మరో రెండు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. మూవీ మేకింగ్ వీడియో, ఓ పవర్‌ఫుల్ సాంగ్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపింది.