తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని BRS నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. '47 సార్లు ఢిల్లీకి వెళ్తే 43 సార్లు రేవంత్‌కు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆ పార్టీ నాయకులే ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రేవంత్ భాష, అక్కసు, కసి పట్ల వాస్తవంగా హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించాలి' అని విమర్శించారు.