TG: రేవంత్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలని అంటున్నారని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. 'రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత ఇస్తేనే ఓటు అడుగుతానని, లేదంటే అడగనని చెప్పాలి. తెలంగాణలో రైతులకు ఎక్కడా 13 గంటల కరెంటు కూడా రావడం లేదు. గుజరాత్‌లో రైతులకు 7 గంటల కరెంటు మాత్రమే, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులకు 8 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అలానే జరగబోతోంది' అని అన్నారు.