సంవత్సరం వేతనాన్ని డొనేట్ చేసిన హరీశ్ రావు (వీడియో)

TG: సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రికి మాజీమంత్రి హరీశ్ రావు ఒక సంవత్సరం వేతనాన్ని డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ఆస్పత్రిలో 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హరీశ్ రావు, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇవాళ చెక్‌ను అందజేస్తున్నట్లు తెలిపారు. పుట్టిన బిడ్డ గుండెకు రంధ్రాలు ఉన్నాయంటే ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతాయని, అలాంటి వారికి ఈ ఆస్పత్రి ఓ వరం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్