BJPలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే?

TG: మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలో చేరుతారనే చర్చ రాష్ట్రంలో జోరుగా నడుస్తోంది. గతంలో తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని హరీష్ రావు స్పష్టం చేసినప్పటికీ, ఇటీవల ఆయన పాదయాత్రకు తగిన కవరేజీ లభించకపోవడంతో ఈ ప్రచారం మరోసారి ఊపందుకుంది. అయితే దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. "కేసీఆర్ దళంలో నిబద్ధత కలిగిన సైనికుడిగా హరీష్ రావు పనిచేస్తున్నారు. ఆయన గడిచిన పాతిక సంవత్సరాలుగా పార్టీలోనే ఉంటున్నారు. హరీష్ రావు కూడా అనేక సందర్భాల్లో వివరించారు. తన చావు.. కూడా గులాబీ పార్టీలోనేని చెప్పారు. అలాంటప్పుడు ఇంకేం క్లారిటీ ఇవ్వాలి.. ఎందుకివ్వాలి.." అని కేటీఆర్ అన్నారు.

సంబంధిత పోస్ట్