TG: రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు తన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో చిన్నారులతో కలిసి 'చిర్రగోనె' ఆట ఆడారు. ప్రోటోకాల్స్ పక్కనపెట్టి వారితో కలిసి సరదాగా గడిపిన ఆయన, ఈ ఆటను పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుని, నెటిజన్లను ఆట పేరు అడిగారు. దీనిపై నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ స్పందించారు.