TG: హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. 'పార్టీని మోసం చేసిన హరీష్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు. పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న వ్యక్తి. ఫ్యూచర్‌లో జాగృతి ముందుకు వెళ్తే బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు తప్పవు. పిల్ల కాకులకు అసెంబ్లీలో బాధ్యతలు ఇవ్వడం ఏంటి?. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. పార్టీని కాపాడుకోవాలి' అని అన్నారు.