TG: మాజీ సీఎం KCR బావ, ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబమంతా ఉదయం నుంచి హరీశ్ ఇంటి వద్దే ఉంది. కానీ కేసీఆర్ కూతురు అయిన కవిత మాత్రం తన మామను చివరి చూపు చూడడానికి రాలేదు. సత్యనారాయణ అంత్యక్రియలకు కవిత దూరంగా ఉండటానికి కారణం.. ఇటీవల హరీశ్ పై ఆమె చేసిన ఆరోపణలే అనే చర్చ మొదలైంది. దగ్గరి బంధువు చనిపోయినా కూడా వెళ్లకపోతే ఎలా అని పలువురు విమర్శిస్తున్నారు.