హర్షిత్ రాణా సూపర్ స్పెల్.. మార్క్‌రమ్ బౌల్డ్

ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌‌ తొలి వికెట్ కోల్పోయింది. LSG స్టార్ ఓపెనర్ ఐడెన్‌ మార్క్‌రమ్ 47 పరుగులకు ఔట్ అయ్యారు. పదకొండో ఓవర్లో హర్షిత్ రాణా వేసిన రెండో బంతికి బౌల్డ్ అయ్యి మార్క్‌రమ్ పెవిలియన్ చేరారు. దీంతో 10.2 ఓవర్లు పూర్తయ్యేసరికి LSG స్కోరు 99/1గా ఉంది. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చారు.

సంబంధిత పోస్ట్